News October 29, 2025

సిద్దిపేట: భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల హెచ్చరికలు

image

మొంథా తుఫాను కారణంగా సిద్దిపేట జిల్లా రెడ్ అలర్ట్‌లో ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోవడం, తడిసిన చేతులతో స్టార్టర్లు, మోటార్లు ముట్టుకోవడం, గాలి, దుమారం, తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోవడం వంటివి చేయవద్దని విద్యుత్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే JLM, ALM, LM, AE దృష్టికి తీసుకువెళ్లాలని విద్యుత్ అధికారులు సూచించారు.

Similar News

News October 30, 2025

నేడే కీలక పోరు.. భారత్ గెలిచేనా?

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మ.3 గంటల నుంచి సెమీ ఫైనల్-2 జరగనుంది. బలమైన AUSను ఎలాగైనా ఓడించాలని IND భావిస్తోంది. షఫాలీ వర్మ రాకతో టాపార్డర్ స్ట్రాంగ్‌గా మారనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవంబర్ 2న సౌతాఫ్రికాతో ఫైనల్‌లో తలపడనుంది. ODI WCలలో ఇప్పటివరకు IND, AUS 14 మ్యాచుల్లో తలపడగా IND మూడింట్లో మాత్రమే గెలిచింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News October 30, 2025

యూట్యూబ్‌ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

image

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్‌స్కేలింగ్’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్‌లో 4K క్వాలిటీ కంటే బెటర్‌గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్‌లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

News October 30, 2025

మెదక్: మహిళపై దాడి, దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

image

మెదక్ జిల్లాలో మహిళపై దాడి, దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు లాక్కొని, అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు పకీరా నాయక్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిందని పేర్కొన్నారు. నిందితుడికి గతంలోనే వేరే కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.