News October 29, 2025

NTR: సెలవులపై క్లారిటీ ఇచ్చిన డీఈవో

image

ఎన్టీఆర్ జిల్లాలోని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం అవాస్తవమని డీఈవో సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రధానోపాధ్యాయులు అధికారికంగా విడుదల కాని సమాచారాన్ని నమ్మకూడదని, ప్రచారం చేయకూడదని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే కార్యాలయం మాత్రమే అధికారిక సందేశాలను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.

Similar News

News October 30, 2025

చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.

News October 30, 2025

గుడికి వెళ్తే ప్రశాంతత ఎందుకు లభిస్తుందంటే..?

image

ఆలయాలను అయస్కాంత శక్తి అధికంగా ఉన్న స్థలాల్లో నిర్మిస్తారు. అయస్కాంత క్షేత్రం కేంద్ర స్థానాన్ని ఎంచుకుని అక్కడ మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. దీనివల్ల ఆ శక్తి విగ్రహం ద్వారా భక్తుల శరీరం, మనసులోకి చేరుతుంది. క్షేత్రంలో కొంత సమయం గడపడం వల్ల అది మనలోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. అందుకే గుడికి వెళ్తే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాల నుంచి గట్టెక్కడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.

News October 30, 2025

‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

image

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.