News October 29, 2025
HYD: ట్రాఫిక్ పోలీసులే చలించి పోతున్నారు.. మీకు పట్టవా?

గ్రేటర్ HYDలో అనేక చోట్ల రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారి కష్టాలను చూసి చిలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు స్వయాన తమకు తోచిన సేవ అందిస్తూ రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే పనిని నెత్తిమీద వేసుకుంటున్నారు. వాహనదారుల కష్టాలకు పోలీసులే చలించిపోతున్నారు. మరీ జీహెచ్ఎంసీ సార్లు.. మీకు ఈ బాధలు పట్టవా? అని ప్రజలు అడుగుతున్నారు.
Similar News
News November 1, 2025
తీవ్ర పేదరికం నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ: సీఎం

తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా CM పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచినట్లు పేర్కొన్నారు. 2021లో ‘తీవ్ర పేదరిక నిర్మూలన’ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. 64వేల కుటుంబాలను గుర్తించి, ఆర్థిక లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. అటు దీన్ని ‘ప్యూర్ ఫ్రాడ్’గా పేర్కొన్న INC అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
News November 1, 2025
మొదటి మహిళా కామెంటేటర్

ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్లుగా మహిళలు కనిపిస్తున్నారు. కానీ 1970ల్లో మగాళ్ల గొంతే వినిపించే క్రికెట్ వ్యాఖ్యానంలోకి వచ్చారు చంద్రనాయుడు. దేశపు తొలి టెస్ట్‌మ్యాచ్ కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు కూతురామె. క్రికెట్ పట్ల ఆసక్తితో కొన్నాళ్లు ప్లేయర్‌గా రాణించారు. దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరైన ఆమె BCCI, ICC ఈవెంట్లలో పాల్గొని భారత తొలిమహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు.
News November 1, 2025
మద్యం ఫీజుల రాకతో బకాయి నిధులు విడుదల

TG: లిక్కర్ షాపుల లైసెన్సు ఫీజుల కింద ₹2,854 కోట్లు రావడంతో ప్రభుత్వం పలు విభాగాల్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తోంది. విద్యార్థులకు ₹304 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ₹252 కోట్లు రిలీజ్ చేసింది. ఇవి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో మున్సిపాల్టీలు, పంచాయతీల రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రతి విభాగంలో కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించేందుకు ₹1కోటి చొప్పున ఇవ్వనుంది.


