News October 29, 2025

‘తులసి బాసో’ వరి రకం ప్రత్యేకతలు ఇవే

image

తులసి బాసో ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. దీనిలో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఖరీఫ్‌కి మాత్రమే అనువైన రకం. 135 రోజుల తర్వాత ఎకరాకు 15-18 క్వింటాళ్లు, రెండవ కోతకు 6-8 క్వింటాళ్లు, మూడో కోతకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొదటి కోతకి మూడో కోతకు గింజ పరిమాణం, సువాసన ఏమాత్రం తగ్గదు. ఎంతటి గాలులనైనా తట్టుకొని పంట ఒరగదు. రైతు ఫోన్ నెంబరు 6300027502, 9440809364.

Similar News

News February 11, 2026

మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) భేటీలో నిర్ణయించారు. 17 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15న శివరాత్రి, తర్వాతి రోజు 16న, మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చిస్తారు. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని నిర్ణయించారు.

News February 11, 2026

నో ఎగ్జామ్.. టెన్త్ ఉత్తీర్ణతతో 28,740 ఉద్యోగాలు

image

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు feb 14తో ముగియనుంది. 16 వరకు ఫీజు చెల్లించాలి. ఏపీలో 1,060, తెలంగాణలో 608 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టెన్త్ ఉత్తీర్ణత కలిగి ఉండి 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. శాలరీ పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా ఉంది.
అప్లికేషన్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 11, 2026

దళిత యువతి వంట చేస్తోందని..

image

తరాలు మారుతున్నా కుల వివక్ష ఆగడం లేదు. ఒడిశాలోని కేంద్రపడాలో దళిత యువతి వంట చేస్తోందని అంగన్వాడీకి పిల్లలను పంపడం లేదు. శర్మిష్ఠ సేథి(23) ఇటీవల ఘడియామల్‌లోని అంగన్వాడీలో హెల్పర్-కుక్‌గా నియమితులయ్యారు. ఆమె వంట చేస్తోందని అంగన్వాడీకి ఎవరి పిల్లల్నీ పంపొద్దని విలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో 3 నెలలుగా ఈ సెంటర్ మూతబడింది. విషయం బయటికి రావడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.