News October 29, 2025

CM సార్.. వికారాబాద్ జిల్లా ఏడుస్తోంది..!

image

వికారాబాద్ జిల్లా నుంచి CM రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, MLAలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా తన దీన స్థితి చూసి వికారాబాద్ జిల్లా ఏడ్చే దుస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ఏ మూల వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెబుతున్నారు. కనీసం రోడ్లు బాగు చేయని పాలకులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. పైఫొటో VKBలోని రైతుబజార్ సమీపంలోని రోడ్డు.

Similar News

News November 1, 2025

HZB: ‘భవనాలు కాదు.. భద్రత, భరోసా కావాలి’

image

ప్రభుత్వం కేవలం భవనాలు నిర్మించడం కాకుండా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు భద్రత, భరోసా కల్పించాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. వంగర గురుకుల పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడ్డ హుజూరాబాద్ రాంపూర్‌కు చెందిన విద్యార్థిని శ్రీ వర్షిత కుటుంబాన్ని ఆయన శుక్రవారం రాత్రి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి వారికి భరోసా కల్పించారు.

News November 1, 2025

అధికారులు అద్భుతంగా పని చేశారు: CM చంద్రబాబు

image

AP: మొంథా తుఫాన్ సమయంలో అధికారులు అద్భుతంగా పని చేశారని CM చంద్రబాబు ప్రశంసించారు. పెను ప్రమాదం తప్పిందని, ముందు జాగ్రత్తతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించామని అన్నారు. తన జీవితంలో చాలా తుఫాన్లు చూశానని, ఈ సారి యంత్రాంగం, టెక్నాలజీ సాయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. 602 డ్రోన్లను వినియోగించి ట్రాక్ చేశామన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సన్మాన పత్రాలు, మెమెంటోలు అందజేశారు.

News November 1, 2025

ఎన్టీఆర్: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలోని కళాశాలల్లో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ 1,2,4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు నవంబర్ 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 960 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు https://anucde.info/ResultsJAug25.asp చూడాలని వర్సిటీ తెలిపింది.