News October 29, 2025

సికింద్రాబాద్: జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ (12713-12714) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైలు ఇకనుంచి జనగామ స్టేషన్‌లో ఆగుతుందని SCR స్పష్టం చేసింది. ఈ నెల 30 నుంచి ఈ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

Similar News

News November 1, 2025

PDPL: లొంగు’బాట’లో మరో మావోయిస్టు..?

image

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్కిన్సన్ వ్యాధి బారినపడ్డ ఆయన తీవ్రఅనారోగ్యం కారణంగా పోలీసులెదుట సరెండర్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టు పార్టీ కీలక సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, చంద్రన్న ఇప్పటికే లొంగియిన విషయం తెలిసిందే.

News November 1, 2025

సూర్యరశ్మి వల్ల ఇన్ని లాభాలా..!

image

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సూర్యరశ్మి(ఉదయం/సాయంత్రం)లో ఉండటం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి విటమిన్-Dని అందిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సెరోటోనిన్‌ను విడుదల చేసి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఉదయం సూర్యకాంతి నిద్ర నాణ్యతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది’ అని సూచిస్తున్నారు. SHARE IT

News November 1, 2025

ఫ్రీ Ai.. బ్యాగ్రౌండ్ రీజన్స్ ఏంటంటే..?

image

మొన్న Grok Aiని మస్క్, నిన్న perplexity Aiని ఎయిర్‌టెల్, తాజాగా గూగుల్ Gemini Aiని ఫ్రీగా ఇస్తున్నట్లు జియో ప్రకటించాయి. ఎందుకు ఈ ఫ్రీ పోటీ అంటే.. మార్కెట్లో డామినెంట్, డాన్ అయితేనే యాడ్స్ వస్తాయిగా. సో.. మార్కెట్ వాటా పొందడం రీజన్1. R2: యూజర్స్ సెర్చ్ డేటా, బిహేవియర్ అర్థం చేసుకోవడం. R3: ప్రస్తుతం తొలి స్టేజ్‌లోని Ai బ్రౌజింగ్ యూజర్స్ ఇన్‌పుట్స్‌తో స్కిల్స్, సర్వీస్ తదితరాలు ఇంప్రూవ్ చేసుకోవడం.