News October 29, 2025
అత్యవసరమైతే 100కి కాల్ చేయండి: ఎస్పీ నరసింహ

మొంథా తుపాను ప్రభావంతో సూర్యాపేట జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే డయల్ 100 లేదా సూర్యాపేట కంట్రోల్ రూమ్ నంబర్ 8712686026కు సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు.
Similar News
News October 30, 2025
సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే నిద్రలేమితో అందం కూడా దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. సరైన నిద్రలేకపోతే శరీరం pH దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.
News October 30, 2025
అన్నదాతకు ‘మొంథా’ దెబ్బ!

‘మొంథా’ తుఫాన్ తెలంగాణపై పిడుగులా వచ్చి పడింది. ఏపీ నుంచి దిశ మార్చుకుని రాష్ట్రంలోని అన్నదాతల ఆశలను తలకిందులు చేస్తోంది. కుండపోత వానలకు వేలాది ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి నేలవాలగా, పత్తి పూర్తిగా దెబ్బతింది. మిరప తోటలు నీటమునిగాయి. పలుచోట్ల ఆరబోసిన మక్కలు తడిచిపోయాయి. పెట్టుబడి మొత్తం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
News October 30, 2025
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.


