News October 29, 2025

వికారాబాద్: భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సమీక్షించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని, సాయంకోసం కంట్రోల్ నంబర్ 8712670056కు కాల్ చేయాలన్నారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్లలోని వాగులు, చెరువులలోని వరద నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు.

Similar News

News November 1, 2025

మరిపెడ: బొలెరో బోల్తా.. యువకుడి మృతి

image

మరిపెడ మండలంలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. ఉప్పరిగూడెం, లచ్చతండాకు చెందిన యువకులు బోలేరోలో సూర్యాపేట జిల్లాలో క్యాటరింగ్‌కు వెళ్తున్నారు. గిరిపురం శివారులో పత్తి మిల్లు మూలమలుపు వద్ద బొలెరో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మందిని 108లో MHBD ఆసుపత్రికి తరలించారు. కాగా ఉప్పరిగూడెం వాసి పవన్ ఆస్పత్రిలో మృతి చెందాడు.

News November 1, 2025

JGTL: రోడ్డు ప్రమాదం.. యువతికి తీవ్ర గాయాలు

image

మల్యాల నుంచి తాటిపెళ్లి వెళ్లే ప్రధాన రహదారిలో సాయిబాబా గుడివద్ద శనివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి నుంచి వస్తున్న RTC బస్సు, ఎదురుగా వస్తున్న బైక్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

HYD: కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి: మంత్రి

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు రహమత్‌నగర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ నగర్ నుంచి ప్రతిభ నగర్ వరకు నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని, నవీన్ యాదవ్‌ని గెలిపించాలని కోరారు.