News October 29, 2025
రేగొండ: ఎయిర్ కూలర్ వైరు తగిలి చిన్నారి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్‌జీ తండాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న బానోతు అంజలి (3), కరెంటు బోర్డుకు, కిందకు వేలాడుతున్న ఎయిర్ కూలర్ వైరును ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 1, 2025
APPLY NOW: CSIR-IMMTలో సైంటిస్ట్ పోస్టులు

భువనేశ్వర్‌లోని CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(IMMT)లో 30 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్ , PhD అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.immt.res.in/
News November 1, 2025
కార్తీక వ్రతం మహిమిదే..

కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగుల వలె భయంతో పారిపోతారు. వందల కొద్దీ యాగాలు చేసిన వారికి స్వర్గ లోకం మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించే పుణ్యాత్ములు నేరుగా వైకుంఠ ధామాన్ని చేరుకుంటారు. కాబట్టి ఇతర యాగాదుల కన్నా పవిత్రమైన, ఉత్తమమైన మోక్ష మార్గం ఈ కార్తీక మాస వ్రతమే అని తెలుసుకొని, ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. <<-se>>#Karthikam<<>>
News November 1, 2025
అనకాపల్లి: జిల్లాలో 82.61 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఉదయం 10.25 గంటల వరకు 2,12,163 మందికి పించన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. కాగా మొత్తం 2,56,820 మందికి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. 82.61 శాతం పూర్తైనట్లు చెప్పారు. ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభం అయిందన్నారు. సాయంత్రంలోగా పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు.


