News October 29, 2025

కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జనగామ కలెక్టర్

image

జిల్లాలో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 24/7 పని చేస్తుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. భారీ వర్షాల వల్ల వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు 90523 08621 సమాచారం అందించాలాన్నారు.

Similar News

News October 30, 2025

నెల్లూరు: ఒక్కో హెక్టార్‌కు రూ.25వేల పరిహారం

image

తుపాను ధాటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 42 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. దెబ్బతిన్న కూరగాయలు, బొప్పాయి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.

News October 30, 2025

అన్నమయ్య‌ జిల్లాలో భూగర్భ‌ జలాల పెరుగుదల: కలెక్టర్

image

ఈ నెలలో అన్నమయ్య జిల్లాలో 3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినందుకు నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భవిష్యత్‌లో వచ్చే తుఫానులకు సిద్ధంగా NOP సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 30, 2025

ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో రికార్డు

image

మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మారిజానె కాప్(44W) నిలిచారు. నిన్న ENGతో సెమీస్‌లో 5 వికెట్లు తీసిన ఆమె, భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి(43)ని అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో లిన్ ఫుల్‌స్టన్(39), మేఘన్ షుట్(39), కరోల్ హోడ్జెస్(37), సోఫీ ఎక్లెస్టోన్(37) ఉన్నారు. కాగా నిన్న SFలో మారిజానె కాప్ బ్యాటింగ్‌లోనూ విలువైన 42 రన్స్ చేశారు.