News October 29, 2025
జనగామ: పలు పాఠశాలలకు ఒక్క పూట సెలవు

జిల్లాలోని పాలకుర్తి మండలంలోని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలలు, కొడకండ్ల మండలంలోని ఎంపీపీఎస్ రామవరం, ధర్మకంచ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జనగామ మండలం చీటకోడూరు, ఎర్రకుంటతండాలో పాఠశాలలకు ఒక్కపూట సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు కలిగే నేపథ్యంలో ఆయా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 30, 2025
కొండపర్తిలో విషాదం.. గోడ కూలి నిద్రలోనే మహిళ మృతి

HNK జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలోని ఎస్సీ కాలనీలో దుర్ఘటన చోటుచేసుకుంది. గద్దల సూరమ్మ(60) అనే మహిళ ఇంటి గోడ కూలిపోవడంతో మంచంలో నిద్రిస్తుండగానే మట్టి కుప్పల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి రాకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News October 30, 2025
నెల్లూరు: ఒక్కో హెక్టార్‌కు రూ.25వేల పరిహారం

తుపాను ధాటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 42 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. దెబ్బతిన్న కూరగాయలు, బొప్పాయి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
News October 30, 2025
అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల: కలెక్టర్

ఈ నెలలో అన్నమయ్య జిల్లాలో 3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినందుకు నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భవిష్యత్‌లో వచ్చే తుఫానులకు సిద్ధంగా NOP సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


