News October 29, 2025
తిరుపతి: ఒక్కొక్కరికి రూ.3వేలు

తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పలువురు బాధితులుగా మారారు. వీరికి ప్రభుత్వం రూ.3వేల సాయం ప్రకటించింది. నారాయణవనం మండలం తుంబూరు సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కలెక్టర్ వెకంటేశ్వర్ వెళ్లారు. ఒక్కొక్కరికి రూ.3 వేలు, నిత్యావసరాలు అందజేశారు.
Similar News
News October 30, 2025
తొలి మ్యాచులో 69కే ఆలౌట్.. చివరికి

ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అద్భుతమైన ఆటతో ఫైనల్ చేరింది. నిన్న సెమీస్‌లో ఇంగ్లండ్‌ను 125రన్స్‌తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే అదే SA జట్టు టోర్నీ తొలి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి మూటగట్టుకోవడం గమనార్హం. ఆ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన SA కేవలం 69 రన్స్‌కే ఆలౌట్ కాగా ENG 10 వికెట్లతో గెలిచింది. ఇప్పుడు సెమీస్‌లో అదే జట్టుపై నెగ్గిన SA టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
News October 30, 2025
నల్గొండ: రాజన్న నిరీక్షణకు తెర పడుతుందా..!

తెలంగాణ క్యాబినెట్‌ను విస్తరించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు బెర్తులుండగా అజారుద్దీన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ బాహాటంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఈసారైనా రాజన్నకు అమాత్య యోగముందా, ఆయన నిరీక్షణకు తెరపడుతుందా అని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.
News October 30, 2025
నంద్యాలలో వ్యభిచారం.. పట్టుబడ్డ నలుగురు అమ్మాయిలు

నంద్యాల NGOs కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నలుగురు యువతులను, ఇద్దరు విటులను పట్టుకున్నామని 2 టౌన్ సీఐ అస్రర్ బాషా బుధవారం తెలిపారు. పవన్ అనే వ్యక్తి కర్నూలు, అనంతపురం, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడన్నారు. యువతులకు కౌన్సెలింగ్ ఇచ్చి, విటులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. పవన్ కోసం గాలిస్తున్నామన్నారు.


