News October 29, 2025
వనపర్తి: ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి

ఐకెపి ద్వారా కేటాయించబడిన అన్ని వరి కొనుగోలు కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఐకెపి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అవసరమైన తూకం యంత్రాలు తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్‌లు మార్కెటింగ్ శాఖ నుంచి తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 29, 2025
ఈ మార్గాల్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచనున్న రైల్వే

గుంటూరు-పగిడిపల్లి, మోటమర్రి(ఖమ్మం)-విష్ణుపురం(నల్గొండ) సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే ఆమోదం తెలిపింది. రూ.188 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో దీనిని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్గాలు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సరకు, ప్యాసింజర్ రైళ్ల సేవలను మరింత వేగవంతం చేయనున్నాయి.
News October 29, 2025
ఓదెల మండలంలో అధిక వర్షపాతం

పెద్దపల్లి జిల్లాలో మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలో అత్యధికంగా 70.5మి.మీ. వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. అధికారులు లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పాలకుర్తి, రామగుండం, అంతర్గాం మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయింది.
News October 29, 2025
భరత్ పోరాటం వృథా.. ఓడిన తెలుగు టైటాన్స్

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్‌లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్‌లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.


