News October 29, 2025
NRPT: మాతృ మరణాలు తగ్గించాలంటూ కలెక్టర్ ఆదేశాలు

జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా పరిధిలో నమోదైన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భిణీలకు సమయానికి ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.
Similar News
News October 30, 2025
ప్రకాశం: నేడు కూడా పాఠశాలలకు సెలవు

ప్రకాశం జిల్లాలోని వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా అన్ని పాఠశాలలకు సెలవులు మంజూరు చేస్తూ డీఈవో కిరణ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని డీఈవో తెలిపారు. ఇప్పటికే తుఫాన్ నేపథ్యంలో 3 రోజులపాటు సెలవు ప్రకటించగా.. తాజాగా మరొక రోజును పొడిగించినట్లు, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News October 30, 2025
బంధాలకు మిడ్‌లైఫ్ క్రైసిస్ ముప్పు

నలభైఏళ్లు దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News October 30, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.


