News October 29, 2025

వికారాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- స్పీకర్

image

తుఫాను ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రైతులు పొలాల వద్దకు వెళ్లరాదని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 1, 2025

వృద్ధుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుని ఇంటికి వెళ్లి కలెక్టర్ తన చేతుల మీదుగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మూర్తి, ఏడీ శశిబిందు, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

News November 1, 2025

HYD: కొత్త మంత్రి అజహరుద్దీన్ శాఖలపై ఉత్కంఠ!

image

కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ శాఖల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. అజహరుద్దీన్ మైనారిటీ సంక్షేమం, హోం శాఖలను పొందుతారని ఊహాగానాలు వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వం ఒక రోజులోనే కొత్త మంత్రుల శాఖలను ప్రకటిస్తుంది. కాగా రేవంత్ మంత్రివర్గంలోని మంత్రులు తమ ప్రస్తుత శాఖలను కోల్పోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. మరి ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారో చూడాలి. దీనిపై మీ కామెంట్?

News November 1, 2025

KNR: ముగిసిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్

image

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు కరీంనగర్, జగిత్యాలలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. మధ్యాహ్నం ముగిసేసరికి పోలింగ్ 44 శాతంగా నమోదయింది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఫలితాల కోసం సభ్యులు, మద్దతుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.