News October 29, 2025
HYDలో భారీ వర్షం.. ఈ మెసేజ్ వచ్చిందా?

HYD, RR, MDCL జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్‌లు పంపింది. మీకూ వచ్చాయా?
Similar News
News October 30, 2025
HYD: నేడు మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. HYD సిటీ పోలీస్ సౌత్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో OCT 30న గుడిమల్కాపూర్ రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఉద్యోగాలు పొందేందుకు 10వ తరగతి పాస్, ఫెయిల్ అయినవారి నుంచి డిగ్రీ హోల్డర్స్ వరకు అందరూ అర్హులే. ఐటీ, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మసీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 87126 61501ను సంప్రదించండి.
SHARE IT
News October 30, 2025
రెండేళ్ల తర్వాత కేబినెట్‌లోకి హైదరాబాదీ!

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకు తెలంగాణ కేబినెట్‌లో హైదరాబాదీకి చోటు దక్కింది. బుధవారం అధిష్ఠానం నుంచి అనూహ్యంగా అజహరుద్దీన్ పేరు ఖరారు చేయడం విశేషం. జూబ్లీహిల్స్ టికెట్ త్యాగం చేసిన ఆయన పార్టీకి విధేయుడిగానే వ్యవహరించారు. దీంతో ‘అజ్జూ భాయ్.. ఏం చేద్దాం’ అని ఆయన చుట్టూ అనుచరులు ప్రదక్షిణలు చేశారు. జూబ్లీ బైపోల్ ముంగిటే మంత్రి పదవి వరించడంతో అజ్జూ భాయ్ అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News October 30, 2025
BREAKING: హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


