News October 29, 2025
HYD: మంత్రి దృష్టికి సబ్సిడీ మీటర్ల సమస్య!

రజక, నాయి బ్రాహ్మణుల 250 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించిన సబ్సిడీ మీటర్లను తొలగించడంపై ప్రభుత్వం వెంటనే తగిన విధంగా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ HYD బీసీ ప్రధాన కార్యదర్శి రంజిత్ సింగ్ డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల మీటర్లను డిస్కనెక్ట్ చేయడం, మీటర్లు ఉంటే కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తామని GHMC అధికారులు నోటీసులిస్తున్నట్లు తెలిపారు. దీనిని త్వరలో మంత్రి పొన్నం ప్రభాకరుకూ విన్నపించనున్నారు.
Similar News
News October 30, 2025
విశాఖలో బెండకాయలు రూ.54

విశాఖ రైతు బజార్‌లలో కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం విడుదల చేశారు. వాటి వివరాలు (రూ.కిలో) టమాటా రూ.30, ఉల్లిపాయలు రూ.20/22, వంకాయలు రూ.40/44/54, బెండకాయ రూ.54, మిర్చి రూ.40, కాకరకాయ రూ.36, అనపకాయ రూ.26, క్యాబేజీ రూ.24, దొండ రూ.42, బీన్స్ రూ.66, పోటల్స్ రూ.62, చిలకడ రూ.30, కంద రూ.52, బద్ద చిక్కుడు రూ.66, తీపిగుమ్మిడి రూ.30, కరివేపాకు రూ.50, బీరకాయ రూ.46గా ఉన్నాయి.
News October 30, 2025
జగన్ ఫోన్ నంబర్ పిటిషన్ కొట్టివేత

AP మాజీ CM జగన్ లండన్ పర్యటన సందర్భంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారంటూ CBI దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. విదేశీ పర్యటనలో అందుబాటులో ఉన్నారా లేదా? మాత్రమే చూడాలంది. ఆయన పర్యటన నుంచి తిరిగొచ్చినందున CBI పిటిషన్‌కు కాలం చెల్లిందని పేర్కొంది. జగన్ ఎప్పుడు స్వదేశానికి వచ్చారో వివరాలతో మెమో దాఖలు చేయాలంది. పెద్ద కుమార్తెను చూసేందుకు OCT 11న జగన్ లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.
News October 30, 2025
ఉప్పునుంతలలో అత్యధిక 63.4 మీ. మీ వర్షపాతం

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉప్పునుంతల మండలంలో 63.4. మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయిందని జిల్లా అధికారులు తెలిపారు. ఈ వర్షం కారణంగా చెరువులు కుంటలు నిండి అలుగుబరాయి. వర్షం కారణంగా ఉప్పునుంతల మండలంలో ఓ వ్యక్తి నీటిలో కొట్టుకు వచ్చి చనిపోయాడు. గేదెలు మేకలు సైతం మృత్యువాత పడ్డాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.


