News October 29, 2025

అన్నమయ్య: యువతిని మోసం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

image

యువతిని మోసం చేసిన వ్యక్తికి కడప 7వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బుధవారం జీవిత ఖైదుతోపాటు రూ.1.6 లక్షల జరిమానా విధించింది. ఆ వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయ అధికారులు వెల్లడించారు. రైల్వే కోడూరు మండలం రెడ్దివారిపల్లికి చెందిన గొంతు సుబ్రమణ్యం, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని మోసం చేశాడు. దీంతో ఆ బాదితురాలు 2022లో కోడూరు పోలీసులని ఆశ్రయించగా నేడు శిక్ష పడింది.

Similar News

News October 30, 2025

గుంటూరు జిల్లాను ముంచెత్తిన వాన

image

మొథా తుపాన్‌ ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. కాకుమానులో అత్యధికంగా 116.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.4, వట్టిచెరుకూరు 76.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తాడేపల్లి, దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురవడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాలు నీటమునిగాయి.

News October 30, 2025

ఆరుట్ల బుగ్గజాతరకు ఇలా వెళ్లండి

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆరుట్ల <<18145591>>బుగ్గరామలింగేశ్వర స్వామి<<>> జాతర NOV 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ సన్నిధిలో తూర్పునుంచి పడమరకు నీరు ప్రవహించడం ప్రకృతి అద్భుతం. ఇక్కడికి ఎల్బీనగర్, పెద్దఅంబర్‌పేట్ నుంచి వెళ్లొచ్చు. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నానికి వెళ్లాలి. అక్కడి నుంచి ఆరుట్ల, బుగ్గతండాకు బస్సులు, ఆటోలుంటాయి. స్వయానా రామయ్యే ప్రతిష్ఠించడం, బుగ్గతండాలో ఉండటంతో బుగ్గరామలింగేశ్వర స్వామిగా పిలుస్తుంటారు.

News October 30, 2025

మంచిర్యాల: పలు రైళ్ల రద్దు

image

మొంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను గురువారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా బల్లార్షా నుంచి భద్రాచలం రోడ్డు స్టేషన్ల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైలును బల్లార్షా నుంచి కాజీపేట స్టేషన్ వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.