News October 29, 2025

MNCL: మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేపట్టాలి

image

అమృత్ 2.0 పథకం కింద IGS ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందు కోసం అవసరమైన వివరాలు సంబంధిత శాఖల అధికారులు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మందమర్రి మున్సిపల్ అధికారులకు మొదటి అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగరం ప్రస్తుత స్థితి, 20ఏళ్ల భవిష్యత్ అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలన్నారు.

Similar News

News October 31, 2025

3 రాష్ట్రాల్లో పోటీ.. ఓ గెలుపు.. తొలిసారి మంత్రి

image

TG: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, <<18158294>>మంత్రి అజహరుద్దీన్<<>> పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో INCలో చేరిన ఆయన మొరదాబాద్(UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్(రాజస్థాన్‌) లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంతరాష్ట్రం తెలంగాణలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

News October 31, 2025

RITESలో 600 పోస్టులు.. అప్లై చేశారా?

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్‌సైట్: https://www.rites.com

News October 31, 2025

కాసిపేట: విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి: కలెక్టర్

image

కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, ఇంటర్మీడియట్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని సూచించారు.