News April 10, 2024

ADB: దంపతుల మధ్య గొడవ.. అడ్డొచ్చిన తండ్రిపై కత్తితో దాడి

image

కొడుకు, కోడలు గొడవ పడుతుంటే వారించడానికి వెళ్లిన తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. స్థానిక చేపల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న రాజుకు అతడి భార్య మధ్య గొడవ జరిగింది. రాజు తండ్రి రవీందర్ వారిని వారించే ప్రయత్నం చేశాడు. మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావంటూ రాజు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో తండ్రిపై దాడి చేశాడు.

Similar News

News March 26, 2026

ఆదిలాబాద్‌లో పోలీసుల నాకాబందీ

image

నేరాల నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై డీఎస్పీ జీవన్ రెడ్డి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాల పరిశీలన, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాలు రూపుమాపడానికి నాకాబందీ కార్యక్రమం నిర్వహించామన్నారు.

News March 25, 2026

ADB: పెట్రోల్ కొరత లేదు.. పుకార్లను నమ్మకండి: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని హెచ్చరించారు. జిల్లాలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బహిరంగంగా పెట్రోల్ విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

News March 25, 2026

పెట్రొల్ పై అసత్య ప్రచారం నమ్మొద్దు: ADB కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడా ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అత్యవసర సేవల వాహనాలకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి సమస్యలు లేదా సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1939ను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.