News October 29, 2025
స్కానింగ్ కేంద్రాలు నిబంధనలు పాటించాలి: డీఎంహెచ్‌ఓ

సంగారెడ్డి జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టం నిబంధనలను పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల బుధవారం తెలిపారు. ఆన్‌లైన్, హార్డ్ కాపీల రూపంలో వివరాలను కార్యాలయానికి పంపాలని ఆమె సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.
Similar News
News November 1, 2025
కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వకూడదని అధికారులకు సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు.
News November 1, 2025
బీఆర్ఎస్ పార్టీలో నాకు అవమానం జరిగింది: కవిత

బీఆర్ఎస్ పార్టీలో నాకు అవమానం జరిగింది.. అందుకే బయటకు వచ్చానని కరీంనగర్‌లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనను కలిచి వేసిందని, ఉద్యమకారులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారన్నారు. పార్టీపై పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకొని మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.
News November 1, 2025
పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

నగరంలోని పార్కులను, పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని పలు పార్కులను ఆయన సందర్శించారు. ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు నగరానికి వస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలని సూచించారు.


