News October 29, 2025
ప్రభుత్వ పాఠశాలలో ఎల్పిజి సిలిండర్ ద్వారా వంట: కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల ద్వారా వంట చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని, అన్ని పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ ద్వారానే మధ్యాహ్న భోజనానికి వంట చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఇందుకోసం ఎల్పీజీ కనెక్షన్ ప్రతి పాఠశాలలో తీసుకునే విధంగా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రాబోయే నెల రోజుల్లో కనెక్షన్లు తీసుకునే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
Similar News
News October 30, 2025
తాజా సినిమా ముచ్చట్లు

✦’అరుంధతి’ సినిమా హిందీలోకి రీమేక్? ప్రధాన పాత్రలో శ్రీలీల నటించనున్నట్లు టాక్
✦ నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘డ్యూడ్’ సినిమా స్ట్రీమింగ్?
✦ తెలుగు డైరెక్టర్ పరశురామ్‌తో సూర్య సినిమా చేసే అవకాశం?
✦ ‘రిపబ్లిక్’ సినిమాకు సీక్వెల్.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది: సాయి దుర్గ తేజ్
✦ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా
News October 30, 2025
శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కంపెనీ వ్యాప్తంగా నాలుగు ఏరియాలలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్తగా వెయ్యి క్వార్టర్లు నిర్మించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియాలో 449, రామగుండలంలో 318, మనుగూరులో 154, భూపాలపల్లిలో 79 క్వార్టర్లు నిర్మించనున్నారు. క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
News October 30, 2025
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చర్చ: మంత్రి టీజీ

కర్నూలులోని ఏ, బీ, సీ క్వార్టర్స్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. బుధవారం ఎస్‌బీఐ కాలనీలో నగర అభివృద్ధిపై కేఎంసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలులోనే బెంచ్ ఉంటే బాగుంటుందని సీఎం కూడా చెప్పారని తెలిపారు. కర్నూలును ‘స్మార్ట్ సిటీ’గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


