News October 29, 2025

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

TG: మొంథా తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.

Similar News

News October 30, 2025

కందిలో పచ్చదోమ – నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నపుడు కందిలో పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుంది. పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు పసుపుపచ్చగా మారి ముడుచుకొని దోనె లాగా కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ఆకులు ఎర్రబడి రాలిపోయి.. మొక్కల ఎదుగుదల, దిగుబడి తగ్గుతుంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 36% S.L 1.6ml లేదా డైమిథోయేట్‌ 30%E.C 2.2ml కలిపి పిచికారీ చేయాలి.

News October 30, 2025

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

image

* ఆధార్‌లో పేరు, అడ్రస్, DOB, మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ₹75 ఛార్జీ చెల్లించాలి. అయితే బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఇందుకు ₹125 వసూలు చేస్తారు.
* బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్, సేఫ్ కస్టడీ కోసం ఇకపై నలుగురు నామినీలను పెట్టుకోవచ్చు.
* SBI: థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లకు, రూ.1,000పైన వ్యాలెట్ రీఛార్జ్‌కు 1 శాతం ఫీజు వర్తిస్తుంది.

News October 30, 2025

అల్పపీడనంగా బలహీనపడిన ‘మొంథా’

image

మొంథా వాయుగుండం నుంచి అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కొనసాగుతోంది. ఇది తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌కు ఉత్తరంవైపు కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు అరేబియా సముద్రంలోని అల్పపీడనం ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.