News October 29, 2025
KPHBలో RAIDS.. మహిళలు, యువతులు అరెస్ట్

కూకట్‌పల్లిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ACP రవికిరణ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు KPHB మెట్రో స్టేషన్, పుల్లారెడ్డి స్వీట్ షాప్, మెట్రో పరిసర ప్రాంతాల్లో రైడ్స్ చేశారు. యువకులు, వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న 11 మంది మహిళలు, యువతులను అదుపులోకి తీసుకొన్నారు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు. ఆరుగురికి 7 రోజుల రిమాండ్ విధించారు.
Similar News
News October 30, 2025
మణుగూరు వద్ద గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా

మణుగూరులోని అశోక్‌నగర్ సాయిబాబా గుడి వద్ద ఈరోజు పెను ప్రమాదం తృటిలో తప్పింది. సుమారు 340 వంట గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. సిలిండర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News October 30, 2025
మేడిపల్లిలో ACBకి చిక్కిన విద్యుత్ అధికారి

యాదరిగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విద్యుత్ శాఖ SE వెంకటరామారావు HYD శివారు మేడిపల్లిలో లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డాడు. మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తికి యాదాద్రి ఆలయ పులిహోర యంత్రాల నిర్వహణ కాంట్రాక్టు దక్కింది. రూ.10 లక్షల బిల్లుల మంజూరుకు వెంకటరామారావు 20% లంచం డిమాండ్ చేశాడు. మేడిపల్లి మారుతీనగర్‌లో రూ.1.90 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు.
News October 30, 2025
సంగారెడ్డి: ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం కష్టాలే

ఈ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. మొదట వర్షాలు కురువకపోగా ఋతుపవనాలు లేటుగా ప్రవేశించాయి. దీంతో వరి నాట్లు లేటుగా వేశారు. వేసిన నాట్లకి చల్లడానికి యూరియా సరఫరా రాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మొంథా తుపాన్‌తో ధాన్యం తడవడంతో కన్నీళ్లే మిగిలాయి. రైతన్నకు ఈ ఖరీఫ్ సీజన్ అంత కలిసి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


