News October 29, 2025
జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీనే ప్రత్యామ్నాయం: కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌కి మద్దతుగా షేక్‌పేట్ డివిజన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలపై మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకుండా ప్రజలను మోసం చేశాయని ఓటర్లకు వివరించారు.
Similar News
News October 30, 2025
BREAKING: హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 30, 2025
ఏసీబీకి పట్టుబడ్డ యాదగిరిగుట్ట ఏఈఈ రామారావు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్‌లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
News October 29, 2025
ఖైరతాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి BRS ఫిర్యాదు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ.సుదర్శన్ రెడ్డిని బుధవారం బీఆర్ఎస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, హామీలు గుమ్మరించి ఓట్లు దండుకునేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కలిసి ECకి ఫిర్యాదు చేశారు.


