News October 29, 2025
విషాదం: 10 రోజులకే వీడిన బంధం.. నవవధువు మృతి

NLG: గుర్రంపోడు(M)లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చామలేడుకు చెందిన సిలువేరు నవీన్, 10 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తన భార్యతో కలిసి బైక్‌పై గుర్రంపోడుకు వెళుతున్నారు. వారు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా మలుపు తిప్పుతున్న మరో బైక్‌ను చూసి నవీన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దంపతులిద్దరూ బైక్‌పై నుంచి ఎగిరి పడగా ఈ దుర్ఘటన జరిగింది.
Similar News
News October 30, 2025
కార్తీక దీపాలంకరణలో ధర్వేశిపురం ఎల్లమ్మ దర్శనం

కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన స్వయంభు శ్రీ ఎల్లమ్మ అమ్మవారు కార్తీక గురువారం సాయంత్రం సందర్భంగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయంలో చేసిన దీపాలంకరణతో భక్తి వాతావరణం అలముకుంది. ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు.
News October 30, 2025
తుఫాను.. అధికారులకు సెలవులు రద్దు: నల్గొండ కలెక్టర్

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులకు సెలవులు రద్దు చేస్తూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి సిబ్బంది అనుమతి లేకుండా సెలవుపై వెళ్లవద్దని, విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News October 30, 2025
నల్గొండ: తుఫాను.. సహాయక చర్యలపై సీఎం వీసీ

మొంథా తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నల్గొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. తుఫాను దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 27 నుంచే 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.


