News October 29, 2025
గద్వాల్ జిల్లాలో ఎల్లుండి రన్ ఫర్ యూనిటీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(జాతీయ ఐక్యత దినోత్సవం) పురస్కరించుకుని ఎల్లుండి శుక్రవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా ఉంచాలని పట్టుబట్టి సంస్థానాలను విలీనంలో కీలకపాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర యువత మరిచిపోకూడదు అన్నారు.
Similar News
News November 1, 2025
అంతర్గాం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

రామగుండం కమిషనర్ పరిధిలోని అంతర్గాం పోలీస్ స్టేషన్ ను సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీశారు.
News November 1, 2025
ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందుకోసం 3,013 RSKలు, 2,061 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ‘ఈసారి 51L టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’ అని పేర్కొన్నారు.
News November 1, 2025
నంద్యాల జిల్లాలో 93.63% పంపిణీ

నంద్యాల జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద తొలి రోజు(శనివారం) పింఛన్ల పంపిణీ ముగిసింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 2,14,571 మందికి గానూ 2,00,899 మందికి(93.63%) పింఛన్లు పంపిణీ చేశారు.


