News October 29, 2025

పాలమూరుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాక

image

జిల్లా కేంద్రానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం రానున్నట్లు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. టీఆర్పీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం, నియామక పత్రాలు, బీసీల రిజర్వేషన్లు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధి విధానాలు, తీరుతెన్నులు తదితర విషయాలపై కార్యక్రమం ఉందన్నారు.

Similar News

News October 30, 2025

MBNR: ‘బీసీ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలి’

image

పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో గురువారం జరిగిన బీసీల కార్యాచరణ సభకు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

News October 30, 2025

PU: ‘ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి’

image

విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీయూ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు బత్తిని రాము డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 4 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని విడతలవారీగా విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం ముఖద్వారం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.

News October 30, 2025

MBNR: వార్షిక పరీక్షకు ‘యూ-డైస్ ఆపార్’ తప్పనిసరి: డీఐఈవో

image

ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై మహబూబ్‌నగర్ జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) కౌసర్ జహాన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు యూడైస్, ఆపార్ జనరేట్ చేస్తేనే వార్షిక పరీక్షకు అర్హులని, లేనిపక్షంలో అనర్హులు అవుతారని స్పష్టం చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని చెప్పారు.