News April 10, 2024

ఈనెల 12న ఇంటర్ ఫలితాలు!

image

AP: ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారట. ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు ఇవాళ మధ్యాహ్నం నాటికి పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏవైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఫలితాల విడుదల ఒకట్రెండు రోజులు ఆలస్యం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Similar News

News March 13, 2026

ప్రతి సినిమాకు సబ్‌టైటిల్స్ కరెక్టేనా.. మీరేమంటారు?

image

అన్ని సినిమాలకు సబ్‌టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ తప్పనిసరి చేస్తూ CBFC తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినికిడి, దృష్టిలోపం ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. సబ్‌టైటిల్స్ వల్ల విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ దెబ్బతింటుందని, మూవీని ఎంజాయ్ చేయలేమని మరికొందరు విమర్శిస్తున్నారు. నటుల యాక్టింగ్‌ను కాకుండా అక్షరాలు చూడాల్సి వస్తుందంటున్నారు. మరి మీరేమంటారు?

News March 13, 2026

ఫాంహౌస్ పాలసీ.. వచ్చే అసెంబ్లీలోనే బిల్లు

image

తెలంగాణలో ఫాంహౌస్‌ల నిర్మాణానికి ఓ ప్రత్యేక విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫాంహౌస్‌ల నిర్మాణం చట్టబద్ధం చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురానుందట. విధివిధానాలు రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పాలసీని ప్రవేశపెట్టాలని చూస్తోంది. కాగా ఆహ్లాదం కోసం, వీకెండ్ సెలవులో నివాసాలను వదిలి ఫాంహౌస్‌లకు చాలామంది వెళ్తుండటం తెలిసిందే.

News March 13, 2026

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ మూడో విడత కింద రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పెట్టుబడి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.