News October 29, 2025

MHBD జిల్లాలో రేపు విద్యా సంస్థలకు సెలవు

image

మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వర్షం తీవ్రంగా ఉండటంతో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు విద్యా సంస్థలకు రేపు సెలవు ప్రకటించినట్లు డీఈవో హెచ్ దక్షిణామూర్తి తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నడుస్తున్నాయని బుధవారం, గురువారం జరిగే పరీక్షలు వాయిదా వేశారని, మిగతావి యథావిధిగా జరుగుతాయని అన్నారు.

Similar News

News October 30, 2025

జూబ్లీ బైపోల్ వైపు.. నార్త్ ఇండియన్స్ చూపు

image

జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న బైపోల్ నార్త్ ఇండియన్స్ చూపు మనవైపు తిప్పింది. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు సౌత్ స్టేట్‌లోని మనదగ్గర బై పోల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉపఎన్నికలు సౌత్ ఇండియాలో కేవలం తెలంగాణ (జూబ్లిహిల్స్)లోనే జరుగుతోంది. పై రాష్టాలన్నింటిలోకి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పరిస్థితి రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.

News October 30, 2025

అంతటా 20మంది లోపే.. జూబ్లీహిల్స్‌లోనే 58 మంది

image

వచ్చేనెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 58 మంది బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా జూబ్లీహిల్స్‌తో సహా మరో 7 చోట్ల బైపోల్స్ జరుగుతున్నాయి. అక్కడ మాత్రం పోటీచేస్తున్న వారి సంఖ్య 20లోపే ఉంది. బుడ్గాంలో 17(J&K), నగ్రోతలో 10(J&K), ఘట్సిలలో 13(ఝార్ఖండ్), డాంపలో 5 (మిజోరం), నువపడలో 14(ఒడిశా), తర్నతరన్లో 15(పంజాబ్), అంటలో 15(రాజస్థాన్) మంది పోటీలో ఉన్నారు.

News October 30, 2025

సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు.