News October 30, 2025
మేడారంలో 5 సెంటీమీటర్ల వాన

తాడ్వాయి మండలం మేడారంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా పడిన వానకు 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగులో 4.9 సెం.మీ, ఖాసీందేవిపేటలో 4 సెం.మీ, వెంకటాపూర్ 3.8 సెం.మీ, తాడ్వాయి 3.5, గోవిందరావుపేటలో 3.1 సెం.మీ వర్షం కురిసింది. వర్షం ఇలాగే కొనసాగి వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను తెరవాలని అధికారులు సమాయత్తమవుతున్నారు.
Similar News
News October 30, 2025
రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.
News October 30, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. GVMCకి రూ.8.07 కోట్ల నష్టం!

మెుంథా తుఫాన్ కారణంగా EPDCL పరిధిలోని 11 సర్కిళ్లలో రూ.10.47 కోట్ల నష్టం సంభవించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రధానంగా కోనసీమ, కాకినాడ, పశ్చి గోదావరి సర్కిళ్లలో ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొంది. తుఫాన్ కారణంగా GVMC పరిధిలో రూ.8.07 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. రోడ్లు, డ్రైనేజీ ధ్వంసం, తీరప్రాంతంలో కోత గురవడం వంటివి జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చారు.
News October 30, 2025
అది వారి ‘రేటు జాబితా’.. ప్రతిపక్షాల మ్యానిఫెస్టోపై మోదీ సెటైర్లు

బిహార్‌లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ‘జంగిల్ రాజ్ నాయకులు ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నారు. మ్యానిఫెస్టో పేరుతో ఆర్జేడీ, కాంగ్రెస్ తమ రేటు జాబితాను రివీల్ చేశాయి. వారి ప్రతి డిక్లరేషన్ వెనుక ప్రధాన ఉద్దేశం అవినీతి, దోపిడీ’ అని ఆరోపించారు. బిహార్‌ను RJD, కాంగ్రెస్ డెవలప్ చేయలేవని, గతంలో తమ పాలనలో ప్రజలను మోసం చేశాయని అన్నారు.


