News April 10, 2024
నరసరావుపేట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అలెగ్జాండర్

కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ స్థానానికి జి.అలెగ్జాండర్‌ను పార్టీ ఖరారు చేసింది. ఆయన నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి 2014, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 1993 నుంచి అలెగ్జాండర్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఈయన పూర్తి పేరు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్. మండలంలోని గురవాయపాలెంలో పుట్టి, నరసరావుపేటలో స్థిరపడ్డారు.
Similar News
News March 26, 2026
కృష్ణా నదిపై 5.3 కి.మీ భారీ రైల్వే వంతెన!

రాజధాని అమరావతిని రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మార్గంలో కృష్ణా నదిపై 5.3 కి.మీ. మేర భారీ రైల్వే వంతెన నిర్మించనున్నారు. రూ. 565.83 కోట్లతో చేపట్టే ఈ వంతెన నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 33 నెలల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
News March 26, 2026
GNT: ఈవీఎం గోడోన్స్ పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, ఫిరంగిపురంలోని ఈవీఎం గోడౌన్‌లను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం తనిఖీ చేశారు. గోడౌన్లలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను, గార్డ్ రూమ్‌ల పరిస్థితి, సీసీటీవీ పనితీరు, ఇన్వర్టర్ స్థితి క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 59.36 శాతం పూర్తి అయిందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలీ, తదితరులు పాల్గొన్నారు.
News March 26, 2026
గుంటూరు కలెక్టర్ బదిలీపై సోషల్ మీడియాలో చర్చ?

గుంటూరు కలెక్టర్‌గా కొనసాగుతున్న తమీమ్ అన్సారియాను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌గా నియమించే అవకాశముందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2015 బ్యాచ్ అధికారిణిగా శ్రీకాకుళం, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె పరిపాలనలో మంచి గుర్తింపు పొందారు. సామాజిక సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. అయితే ఈ నియామకంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.


