News October 30, 2025
ఇచ్ఛాపురంలో పర్యటించిన జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్

‘మెంథా’ తుపాను ప్రభావంతో జిల్లాలో నష్టం వాటిల్లిన నేపథ్యంలో, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఇచ్ఛాపురం మండలంలో పర్యటించారు. తుపాన్ కారణంగా జిల్లాలో అత్యధికంగా ఈ మండలంలో 1,118 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. బిల్లంగి, జగన్నాథపురం గ్రామాల్లో నీటి ముంపులో ఉన్న వరి చేలును ఆయన పరిశీలించారు. 53 క్యూసెక్కులు నీరు బహుదానదిలో ప్రవహిస్తుందన్నారు. నష్టం అంచనా వేయాలన్నారు.
Similar News
News November 1, 2025
కాశీబుగ్గ ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి <<18167876>>ఆలయ తొక్కిలాట దుర్ఘటన<<>>పై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దేవాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి.. సంఘటన స్థలానికి బయల్దేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది.
News November 1, 2025
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి కళ్యాణం జరిగింది. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News November 1, 2025
శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతున్న దొంగతనాలు

జిల్లాలో వరుస చోరీ ఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. తూ.గో జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఈ నెల 10న నరసన్నపేటలో ట్రాన్స్‌జెండర్లు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాజాగా కాశీబుగ్గలో చోరీ, సారవకోట(M) బుడితిలో వృద్ధురాలి మెడలో బంగారం చోరీ చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్న AP, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.


