News October 30, 2025
అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోడూరు మండలంలో పర్యటించనున్నట్లు ఏపీ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 8:30 గంటలకు నాగాయలంకలో, 10:30 గంటలకు కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన ప్రకటనలో వివరించారు.
Similar News
News November 1, 2025
కృష్ణా జిల్లాలో 630 మంది వితంతువులకు కొత్త పెన్షన్లు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 630 మంది వితంతు మహిళలకు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. నవంబర్ నెల మొదటి తేదీతో ప్రారంభమయ్యే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఈ కొత్త లబ్ధిదారులకు కూడా పెన్షన్ అందజేయనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ పెన్షన్ల మంజూరు ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థిక భరోసా పొందారు.
News October 31, 2025
కార్తీక మాసానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభం

కార్తీకమాసంలో శైవక్షేత్రాలను దర్శిస్తే అపారమైన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు పంచారామాలు, అరుణాచలం, యాగంటి, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం, వాడపల్లి వంటి ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళికలు రూపొందించారు.
News October 31, 2025
కాలువల్లో అడ్డంకులు తొలగిస్తున్నాం: కలెక్టర్

మొంథా తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పొలాలలోని నీటిని బయటకు పంపేందుకు మురుగు కాలువలకు అడ్డంకులు తొలగించే విధంగా అవసరమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి నుంచి RTG, HRD విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు.


