News October 30, 2025
మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సుల్లో సీట్ల భర్తీకై అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీహరి రావు తెలిపారు. DMLT 30 సీట్లు, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ 30 సీట్లు కోర్సులకు ఇంటర్‌లో BIPC, MPC, ఆర్ట్స్ గ్రూప్ చదివిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులను నవంబర్ 27వ తేదీ వరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో అందజేయాలని ఆయన సూచించారు.
Similar News
News November 1, 2025
కాశీబుగ్గ ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ

కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి తొక్కిసలాటకు కారణాలపై స్థానికులను, భక్తులతో ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనలో మృతులు, క్షతగాత్రుల వివరాలు, ఆస్పత్రిలో చికిత్స అందుతున్న పరిస్థితిపై పర్యవేక్షించారు. వీరితో పాటు పలువురు జిల్లా అధికారులు ఉన్నారు.
News November 1, 2025
వేలానికి బంగారు టాయిలెట్.. ప్రారంభ ధర ₹83Cr!

బంగారంతో తయారుచేసిన టాయిలెట్ కమోడ్ వేలానికి సిద్ధమైంది. ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ విచిత్ర కళాఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. ధనవంతుల అహంకారం, వారి ఆర్భాటపు జీవితం ఎంత నిష్ఫలమో ఈ ‘గోల్డ్ టాయిలెట్’ ద్వారా సందేశం ఇస్తున్నట్లు సృష్టికర్త పేర్కొన్నారు. న్యూయార్క్‌లో నవంబర్ 18న వేలం జరగనుంది. ప్రారంభ ధర ₹83 కోట్లుగా నిర్ణయించారు.
News November 1, 2025
ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి?

ఏకాదశి వ్రతం పాటించే భక్తులు ఆ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి. రాత్రంతా పురాణ శ్రవణం చేస్తూ, జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో మళ్లీ విష్ణు పూజ చేసి, భోజనం స్వీకరించాలి. అలా వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నారద పురాణం ప్రకారం.. ధాన్యం, సంపద, ఉన్నత స్థానం లభిస్తాయని నమ్మకం. యజ్ఞయాగాలు, పుణ్యక్షేత్ర దర్శనాల ఫలం కన్నా ఎన్నో రెట్ల అధిక పుణ్యం వస్తుందట.


