News October 30, 2025
కామారెడ్డి: ఉజ్వల కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాకు కొత్తగా 284 ఉజ్వల కనెక్షన్లు మంజూరైనట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం ఉజ్వల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిపిఎల్ కుటుంబాలు, గ్యాస్ కనెక్షన్ లేనివారు మాత్రమే అర్హులన్నారు. అర్హత గల లబ్ధిదారులు వెంటనే డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు.
Similar News
News November 1, 2025
జగిత్యాల: ‘ఎవరైన చావాలా సార్..?’

మల్యాలలో <<18168200>>నేడు రోడ్డుప్రమాదం<<>> జరిగిన సంగతి తెలిసిందే. కాగా రోడ్డుకిరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై OCT 17న ‘రోడ్డును కమ్మేసిన పిచ్చిమొక్కలు’ శీర్షికన Way2Newsలో వార్త ప్రచురితమైంది. అయినా అధికారులు మాకేం పట్టింపన్నట్లుగా ఉండటంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ‘ఎవరైన చావాలా’ అని అడుగుతున్నారు.
News November 1, 2025
HYD: KCR పదేళ్లు దోచుకున్నాడు: జేఏసీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. శనివారం HYD బషీర్‌బాగ్‌లో జాక్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందన్నారు. KCR 10ఏళ్లలో దోపిడీ, నిరంకుశ పాలనను సాగించారని, BRSను ఓడించాలని ప్రజలను కోరారు.
News November 1, 2025
వీధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: DEO

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, హాజరును ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈఓ సూచించారు.


