News October 30, 2025
హుజూర్‌నగర్‌కు మూడు పేర్లు

హుజూర్‌నగర్‌కు పాతకాలంలో పురుషోత్తమపురి, పోంచర్ల అనే రెండు పేర్లు ఉండేవి. ఫణిగిరి గుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి వెలయడంతో ఈ ప్రాంతం పురుషోత్తమపురిగా పేరొందింది. ఆ తర్వాత ముత్యాలమ్మ (పోచమ్మ) దేవాలయం ఏర్పడటంతో పోంచర్లగా మారింది. నవాబుల పాలనలో దీనిని హుజూర్‌నగర్‌గా మార్చారు. ఈ రెండు ఆలయాలు నేటికీ ఈ ప్రాంత ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉన్నాయి.
Similar News
News October 30, 2025
HYD: BJP చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందే: మహేశ్

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కలలు కన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరించే పార్టీ.. మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీజేపీకి ఫ్యూచర్లో ఏ పనిలేక చివరికి చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని ఘాటుగా విమర్శించారు.
News October 30, 2025
కోడూరు: పవన్ పర్యటనకు పర్యటనకు భారీ బందోబస్తు!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోడూరు మండలంలో పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్‌ను చూసేందుకు ప్రజలు అధికంగా వస్తారనే అంచనాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కోడూరు శివారు కృష్ణాపురం వద్ద బారిగేట్లు పెట్టారు. ఉదయం 10.30 గంటల సమయంలో పవన్ అక్కడికి చేరుకుని.. ముంపు పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు.
News October 30, 2025
నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు: DEO

జిల్లాలో తుఫాన్ ప్రభావం తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని DEO కె. వాసుదేవరావు ప్రకటించారు. తుఫాను పునరావాస కేంద్రాల కోసం వినియోగించిన పాఠశాలలను సిబ్బందిచే పరిశుభ్రంగా ఉంచాలని, పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న భవనాల వద్దకు విద్యార్థులు వెళ్లకుండా స్కూల్ హెచ్ఎంలు జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులకు హాట్ వాటర్ అందించాలని DEO సూచించారు.


