News October 30, 2025

తిరుమలలో పుష్పార్చన గురించి తెలుసా..!

image

పవిత్రమైన కార్తీక మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి పుష్పాలతో అర్చన చేస్తారు. కనుక దీనిని పుష్పార్చన అని అంటారు. ఈ వేడుక 30వ తేదీ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనుంది.

Similar News

News October 30, 2025

మేడిపల్లిలో ACBకి చిక్కిన విద్యుత్ అధికారి

image

యాదరిగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విద్యుత్ శాఖ SE వెంకటరామారావు HYD శివారు మేడిపల్లిలో లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డాడు. మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తికి యాదాద్రి ఆలయ పులిహోర యంత్రాల నిర్వహణ కాంట్రాక్టు దక్కింది. రూ.10 లక్షల బిల్లుల మంజూరుకు వెంకటరామారావు 20% లంచం డిమాండ్ చేశాడు. మేడిపల్లి మారుతీనగర్‌లో రూ.1.90 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు.

News October 30, 2025

సంగారెడ్డి: ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం కష్టాలే

image

ఈ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. మొదట వర్షాలు కురువకపోగా ఋతుపవనాలు లేటుగా ప్రవేశించాయి. దీంతో వరి నాట్లు లేటుగా వేశారు. వేసిన నాట్లకి చల్లడానికి యూరియా సరఫరా రాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మొంథా తుపాన్‌తో ధాన్యం తడవడంతో కన్నీళ్లే మిగిలాయి. రైతన్నకు ఈ ఖరీఫ్ సీజన్ అంత కలిసి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 30, 2025

ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక.!

image

మెంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా, కృష్ణా నది ఉపనదులలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో కృష్ణా నదికి వేగంగా వరదలు వస్తున్నట్లు రివర్ కన్జర్వేటర్-కృష్ణ & ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో నేడు 6,00,000 క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని, వరద వేగంగా పెరుగుతోందని చెప్పారు. అన్ని విభాగాలు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.