News October 30, 2025

నేడు కాలేజీల బంద్‌కు SFI పిలుపు

image

TG: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్‌తో SFI ఇవాళ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. BTech, ఫార్మసీ, మెడికల్, డిగ్రీ, PG కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు సహకరించాలని కోరింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు స్టూడెంట్స్ నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని SFI లీడర్లు ఆరోపించారు. దీని వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు.

Similar News

News November 1, 2025

ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్‌కు స్టబ్స్?

image

IPL వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక స్వాప్ డీల్ పూర్తయినట్లు సమాచారం. RR కెప్టెన్ సంజూ శాంసన్, DC ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ జట్లు మారడం ఖాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని IPL వర్గాలు చెబుతున్నాయి. KL రాహుల్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ ఆయనను వదులుకోవడానికి ఢిల్లీ సుముఖత చూపలేదు. 2026 సీజన్‌కు సంజూను కెప్టెన్ చేయాలని DC భావిస్తోంది.

News November 1, 2025

కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రిలో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

News November 1, 2025

బిహార్‌లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే: JVC సర్వే

image

బిహార్‌లో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ NDA, MGBల మధ్య వార్ నువ్వానేనా అన్నట్లు నడుస్తోంది. ఈ తరుణంలో ఏది గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతుందని JVC సర్వే చెబుతోంది. 243 సీట్లలో NDAకు 120-140 మధ్య సీట్లు రావచ్చంది. MGBకి 93-112 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అయితే CM అభ్యర్థిగా తేజస్వీకి 33%, నితీశ్‌కు 29% మంది మద్దతు తెలిపారు. ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ 3వ ప్లేస్‌లో ఉన్నారు.