News October 30, 2025
ధ్వజస్తంభం విశేషాలివే..

ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాతే మూల విరాట్టును చూడాలంటారు. అంతటి ప్రాధాన్యం దీనికుంది. ఆలయ నిర్మాణంలో ఇది అత్యంత ముఖ్యమైన భాగం. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగా, ధ్వజస్తంభాన్ని హృదయంగా భావిస్తారు. విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా దీనిని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభానికి కూడా దీపారాధనలు, ఉపచారాలు చేస్తారు. ఆలయ ద్వారాలు మూసి ఉన్నా, ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Similar News
News November 1, 2025
ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందుకోసం 3,013 RSKలు, 2,061 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ‘ఈసారి 51L టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’ అని పేర్కొన్నారు.
News November 1, 2025
పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ

AP: పోలవరం భూ నిర్వాసితులకు రూ.1000 కోట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు నిర్వాసితుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు మంత్రి రామనాయుడు వెల్లడించారు. ఏలూరులోని వేలేరుపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో దళారుల మాట నమ్మొద్దని సూచించారు. 2027కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.
News November 1, 2025
ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్‌కు స్టబ్స్?

IPL వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక స్వాప్ డీల్ పూర్తయినట్లు సమాచారం. RR కెప్టెన్ సంజూ శాంసన్, DC ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ జట్లు మారడం ఖాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని IPL వర్గాలు చెబుతున్నాయి. KL రాహుల్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ ఆయనను వదులుకోవడానికి ఢిల్లీ సుముఖత చూపలేదు. 2026 సీజన్‌కు సంజూను కెప్టెన్ చేయాలని DC భావిస్తోంది.


