News October 30, 2025

అన్నమయ్య: ‘సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

అన్నమయ్య జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ధీరజ్ సూచించారు. స్కాలర్‌షిప్‌లు, తుఫాను పరిహారం పేరుతో విద్యార్థులు, రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News November 1, 2025

సంగారెడ్డి: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2025 జాబితాను 4 కేటగిరీలుగా విభజించినట్లు చెప్పారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేసే మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు.

News November 1, 2025

సంగారెడ్డి: ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఉత్తర్వులు జారీ

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోనీ ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఆ వివరాలను మండల విద్యాధికారుల ద్వారా జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.

News November 1, 2025

వేలేరుపాడు: రూ.1,000 కోట్లు చెక్కు పంపిణీ చేసిన మంత్రి

image

వేలేరుపాడు మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన రూ. 1,000 కోట్ల భూసేకరణ పునరావాసం సంబంధించిన చెక్కిన సంబంధిత నిర్వాసితులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నిర్వాసితులకు నేరుగా రూ.1,000 కోట్ల పరిహారం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని మంత్రి తెలిపారు.