News October 30, 2025

తిరుమలలో మరిన్ని శాశ్వత క్యూలైన్లు

image

AP: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. SSD టోకెన్లు కలిగిన భక్తుల కోసం తిరుమలలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలో నూతన షెడ్లు, క్యూలైన్ల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించింది. బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు 3కి.మీ మేర రూ.17.60 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనుంది. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 30, 2025

పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు: పవన్

image

AP: మొంథా తుఫాను ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా చూడాలని Dy.CM పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు, రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులున్న చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి’ అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. పంట, ఆస్తినష్టం వివరాలను ప్రజల నుంచి వాట్సాప్‌లో సేకరిస్తోంది.

News October 30, 2025

రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

image

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలతో అనారోగ్యాలు వస్తాయంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

ఐఐఐటీ బెంగళూరులో ఉద్యోగాలు

image

ఐఐఐటీ బెంగళూరు 5 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Sr రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, రీసెర్చ్ ఇంటర్న్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును srinivas.vivek@iiib.ac.in మెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://iiitb.ac.in