News October 30, 2025
లాభాలు పొందిన వారు వెనక్కి ఇవ్వాలి: సీపీ

అద్విక ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందినవారంతా వాటిని వెనక్కి ఇవ్వాలని సీపీ రాజశేఖర్ బాబు ప్రతిపాదించారు. లేనిపక్షంలో సంస్థ ఎండీ శ్రీవెంకట ఆదిత్య దంపతుల మాదిరిగా కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించి, వారికి నగదు బహుమతులు అందజేశారు.
Similar News
News October 30, 2025
నల్గొండ: ఖజానా ఉన్నా.. సుదీర్ఘ నిరీక్షణ

గుర్రంపోడు జీపీ భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. 8 సంవత్సరాల క్రితం నిధులు మంజూరైనప్పటికీ స్లాబ్ వరకు కట్టి అర్ధాంతరంగా వదిలేశారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు, నాయకుల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేయకుండా ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలాంటి భవనాలున్నాయా..?
News October 30, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: కేటీఆర్.. అన్నీ తానై

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తమ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉపఎన్నికలో పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో చర్చిస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఎన్నికలను తన భుజస్కంధాలపై మోస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
News October 30, 2025
పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు: పవన్

AP: మొంథా తుఫాను ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా చూడాలని Dy.CM పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు, రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులున్న చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి’ అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. పంట, ఆస్తినష్టం వివరాలను ప్రజల నుంచి వాట్సాప్‌లో సేకరిస్తోంది.


