News October 30, 2025
అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల: కలెక్టర్

ఈ నెలలో అన్నమయ్య జిల్లాలో 3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినందుకు నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భవిష్యత్‌లో వచ్చే తుఫానులకు సిద్ధంగా NOP సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 30, 2025
సిరిసిల్ల: ‘టార్ఫాలిన్లు కచ్చితంగా అందజేయాలి’

రైతులకు టార్ఫాలిన్లు కచ్చితంగా అందజేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. తంగళ్లపల్లి మం. జిల్లెలలో తడిసిన ధాన్యాన్ని గురువారం ఆమె పరిశీలించారు. భారీవర్షాలు ఉన్నందున రైతులు 2, 3 రోజులు కోతలను వాయిదా వేసుకోవాలన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్ఫాలిన్లు అందజేయాలని ఆదేశించారు. వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు.
News October 30, 2025
వివేకానగర్ కాలనీ: శ్రీ హోమ్స్ అపార్ట్మెంట్ జలదిగ్బంధం

మొంథా తుఫాన్ ప్రభావంతో హనుమకొండ నగరంలోని వివేకానగర్ కాలనీలో తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. తులసీ బార్ ఎదురుగా ఉన్న శ్రీ హోమ్స్ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా పూర్తిగా నీట మునిగిపోగా, 60 ఫ్లాట్లలో నివసిస్తున్న 220 మంది బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. రాత్రి నుంచి విద్యుత్, తాగునీరు, పాలు, వంట సామగ్రి అందుబాటులో లేక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
News October 30, 2025
పరమేశ్వర స్వామి చెరువులో పడి మహిళ మృతి

ఆత్మకూర్ పరమేశ్వర స్వామి చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన బోయ చిట్టెమ్మ ఉదయం పరమేశ్వర స్వామి చెరువు దగ్గర మృతి చెందినట్లు చెప్పారు. మృతి చెందిన చిట్టెమ్మకు మతిస్థిమితం లేనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


