News April 10, 2024
తూ.గో: 70 కేసులు ఉన్న దొంగ అరెస్ట్

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డ యూనియన్ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తెచ్చిన వృద్ధురాలు వాకా కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.
Similar News
News March 25, 2026
రాజమండ్రి చేరుకున్న వి.ఎల్.కాంతారావు

పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్.కాంతారావు బుధవారం రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పురోగతిపై కాంతారావు అధికారులతో చర్చించనున్నారు.
News March 24, 2026
కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.