News October 30, 2025

నల్గొండ: రాజన్న నిరీక్షణకు తెర పడుతుందా..!

image

తెలంగాణ క్యాబినెట్‌ను విస్తరించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు బెర్తులుండగా అజారుద్దీన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ బాహాటంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఈసారైనా రాజన్నకు అమాత్య యోగముందా, ఆయన నిరీక్షణకు తెరపడుతుందా అని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.

Similar News

News October 30, 2025

అభ్యంగ స్నానంతో ఎన్నో ప్రయోజనాలు

image

వారానికోసారి అభ్యంగన స్నానం చేయాలని ఆయుర్వేద శాస్త్రం సూచిస్తుంది. తైలాభ్యంగం ముఖ్యమని చెబుతోంది. స్పర్శేంద్రియమైన చర్మంలోనే ఈ శరీరం ఉంటుంది. అందువల్ల నూనె లేపనం శరీరానికి బలం, కాంతిని ఇస్తుంది. శిరస్సు నందు అభ్యంగనం వల్ల ఇంద్రియాలు తృప్తి చెందుతాయి. దృష్టి దోషాలు తొలగి, శిరో రోగాలు నశిస్తాయి. అవయవాలకు బలం చేకూరుతుంది. పాదాల పగుళ్లు తగ్గుతాయి. నిద్ర బాగా పడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

News October 30, 2025

ఇంటర్వ్యూతో IRCTCలో 64 ఉద్యోగాలు

image

IRCTC 64 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(హాస్పిటాలిటీ), BBA/MBA, BSc(హోటల్ మేనేజ్‌మెంట్& క్యాటరింగ్ సైన్స్), MBA(టూరిజం& హోటల్ మేనేజ్‌మెంట్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ వివిధ ప్రాంతాల్లో నవంబర్ 8 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com

News October 30, 2025

తుపాన్ సహాయక చర్యల్లో అధికారుల పనితీరు భేష్: కలెక్టర్

image

తుపాన్ సహాయక చర్యల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లాలో మొత్తం 4,553 కుటుంబాలకు చెందిన 9,450 మందిని పునరావస కేంద్రాలకు తరలించి రక్షణ కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా కుటుంబానికి రూ.3 వేలు, నిత్యవసర సరకులు ప్రభుత్వం అందిస్తోందని, ఈ కార్యక్రమాన్ని తెనాలి నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.