News April 10, 2024
చిత్తూరులో ఎండలు.. కాస్త తగ్గుముఖం.

వారంరోజులుగా నిప్పుల కొలిమిని తలపించిన ఎండలు.. చిత్తూరులో మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. మండలాలవారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. శ్రీరంగరాజపురంలో 39.4, నిండ్రలో 39.0, విజయపురంలో 38.9, నగరిలో 38.9, పుంగనూరులో 38.8, గుడిపాలలో 38.7, తవణంపల్లెలో 38.3, గుడుపల్లెలో 38.0, పాలసముద్రంలో 37.8, చిత్తూరులో 37.6, సదుంలో 37.6, శాంతిపురంలో 37.4, కుప్పంలో 37.1, బంగారుపాళ్యంలో 37.0, నమోదయ్యాయి.
Similar News
News January 14, 2026
టీచర్లకు చిత్తూరు DEO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈనెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. 189 మంది మాత్రమే నమోదు చేశారని.. మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
News January 14, 2026
CTR: భారీగా పడిపోయిన టమాటా ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ బుధవారం గరిష్ఠంగా రూ.194, కనిష్ఠంగా రూ.140 పలికింది. పలమనేరులో గరిష్ఠ ధర రూ.220, కనిష్ఠ ధర రూ.170, వి.కోటలో గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.140, ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.230, కనిష్ఠ ధర రూ.120గా నమోదైంది.
News January 14, 2026
చిత్తూరు జిల్లాలో 62 బస్సులకు జరిమానా

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు డీటీసీ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఐదు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో అధిక ఛార్జీలు వసూలు చేసిన 30 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. రూ.3 లక్షల మేర జరిమానా విధించినట్లు చెప్పారు. పన్ను చెల్లించని, పర్మిట్ లేని 32 బస్సులను గుర్తించి రూ.2 లక్షల మేరకు జరిమానా వసూళ్లు చేశామన్నారు.


