News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మరి ఎమ్మెల్సీ ఎప్పుడు?

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన MLA/MLC కాదు. ఈ రెండూ కాకపోయినా మంత్రివర్గంలో చేరవచ్చు. 6 నెలల్లోపు ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సిందే. గవర్నర్ కోటా MLCలుగా అజహరుద్దీన్, కోదండరామ్ పేర్లను ప్రభుత్వం 2నెలల కిందట సిఫారసు చేయగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Similar News
News October 30, 2025
భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>
News October 30, 2025
నీలి రంగులోకి మారిపోయిన కుక్కలు.. కారణం అదేనా?

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ సమీపంలో కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇవి 1986 నాటి అణు ప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన శునకాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్లే ఇలా మారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని మూలాన్ని గుర్తించడానికి వాటి వెంట్రుకలు, రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.
News October 30, 2025
తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు

AP: ‘మొంథా’ తుఫాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. ముందస్తు చర్యలతో నీటిపారుదల శాఖకు తక్కువ నష్టమే వాటిల్లిందని తెలిపారు.


