News October 30, 2025

HYD: నేడు మెగా జాబ్ మేళా

image

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. HYD సిటీ పోలీస్ సౌత్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో OCT 30న గుడిమల్కాపూర్ రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఉద్యోగాలు పొందేందుకు 10వ తరగతి పాస్, ఫెయిల్ అయినవారి నుంచి డిగ్రీ హోల్డర్స్ వరకు అందరూ అర్హులే. ఐటీ, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మసీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 87126 61501ను సంప్రదించండి.

SHARE IT

Similar News

News October 30, 2025

NZB: నీలకంఠేశ్వరుడి సేవలో కలెక్టర్ దంపతులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయంలో కలెక్టర్ వినయ్‌కృష్ణా రెడ్డి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ శ్రీరాం రవీందర్ తెలిపారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, హారతి, మొదలగు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ దంపతులను శేషవస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సిరిగిరి తిరుపతి ఉన్నారు.

News October 30, 2025

భారీ వర్షాలు.. బెల్లంపల్లిలో అత్యధికం

image

గడచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలో 42.4MM వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా బెల్లంపల్లిలో 70.4మి.మీ నమోదు కాగా, జన్నారంలో 17.8, దండేపల్లి 13.8, లక్షెట్టిపేట 29, హాజీపూర్ 64.8, కాసీపేట 41.2, తాండూర్ 32.8, భీమిని 29.6, కన్నేపల్లి 32.6, వేమనపల్లి 44, నెన్నెల 32.4, మందమర్రి 29, మంచిర్యాల 68.6, నస్పూర్ 58, జైపూర్ 69.4, భీమారం 45.6, చెన్నూర్ 51, కోటపల్లిలో 34.2మి.మీ వర్షపాతం నమోదైంది.

News October 30, 2025

విశాఖలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణమిదే

image

భవనం నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వాలంటూ ముగ్గురు బెదిరిస్తున్నారని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ తన ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తుండగా ఇదే ప్రాంతానికి చెందిన నర్సింగరావు, అరుణ్ బాబు, శంకర్రావు బెదిరించడం వల్లే తాను అత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. దీంతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.