News October 30, 2025

జగన్ ఫోన్ నంబర్ పిటిషన్ కొట్టివేత

image

AP మాజీ CM జగన్ లండన్ పర్యటన సందర్భంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారంటూ CBI దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. విదేశీ పర్యటనలో అందుబాటులో ఉన్నారా లేదా? మాత్రమే చూడాలంది. ఆయన పర్యటన నుంచి తిరిగొచ్చినందున CBI పిటిషన్‌కు కాలం చెల్లిందని పేర్కొంది. జగన్ ఎప్పుడు స్వదేశానికి వచ్చారో వివరాలతో మెమో దాఖలు చేయాలంది. పెద్ద కుమార్తెను చూసేందుకు OCT 11న జగన్ లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.

Similar News

News October 30, 2025

KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్

image

IPL: KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. జట్టుకు గత 3 సీజన్లుగా హెడ్ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్‌ను ఈ ఏడాది JULYలో తొలగించిన విషయం తెలిసిందే. వారం క్రితమే కోచ్‌ పదవిపై నాయర్‌తో KKR సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పండిట్‌ శిక్షణలో జట్టు 2024లో విజేతగా నిలిచినప్పుడు నాయర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నారు. అటు ఈ ఏడాది మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో UP వారియర్స్‌ జట్టుకు చీఫ్‌ కోచ్‌గా పనిచేశారు.

News October 30, 2025

భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

image

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>

News October 30, 2025

నీలి రంగులోకి మారిపోయిన కుక్కలు.. కారణం అదేనా?

image

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్ ప్లాంట్‌ సమీపంలో కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇవి 1986 నాటి అణు ప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన శునకాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్లే ఇలా మారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని మూలాన్ని గుర్తించడానికి వాటి వెంట్రుకలు, రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.